కొత్త సినిమా మొదలు కావడానికి మరో రెండు నెలలు సమయం ఉందంటే ఏ దర్శకుడైనా కానీ ఆ కథకి నగిషీలు చెక్కే పనిలో ఉంటాడు. మరి కాస్త బెటర్ చేయడానికి స్కోప్ ఉందేమో ఆలోచిస్తూ మరికొన్ని సార్లు స్క్రిప్టుని రివైజ్ చేసుకుంటాడు. కానీ పూరి జగన్నాథ్ అయితే అలాక్కాదు. తన కొత్త సినిమా స్టార్ట్ అవడానికి రెండు నెలల సమయం ఉందని తెలిస్తే ఈ గ్యాప్‌లో ఇంకో సినిమా ఏదైనా త్వరగా చుట్టి పారేయవచ్చేమోనని ఆలోచిస్తాడు. చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన చిరంజీవి 150వ చిత్రం కాబట్టి ఇది సెట్స్ మీదకి వెళ్లేలోగా డైలాగుల పరంగానో, కథనం పరంగానో బెటర్‌మెంట్ చేయడానికి పూరి జగన్నాథ్ ప్రయత్నించాలి.
కానీ తన వరకు ఆ కథ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక దానికి మరమ్మతులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదనేది పూరి ఫీలింగ్. అందుకే అది సెట్స్ మీదకి వెళ్లేలోగా నితిన్‌తో ఒక చిత్రాన్ని చుట్టి పారేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ముప్పయ్ ఏడు రోజుల్లో జ్యోతిలక్ష్మీ చిత్రం పనులు పూర్తి చేసేసాడు కాబట్టి అలాగే ఈ మూడు నెలల గ్యాప్‌లో నితిన్ సినిమా చేసేయవచ్చని పూరి భావిస్తున్నాడు. ఇంకా దీనికి నితిన్ రెడీగా లేడు కానీ అతను సై అంటే సెప్టెంబర్‌లోగా ఆ సినిమాని పూర్తి చేసి అవతల పడేయడం పూరీ సార్‌కి పెద్ద పనేం కాదు.
Post a Comment