0

బాహుబలి చిత్రంలోని పాత్రల పరిచయాలు అయిపోయాయి. బాహుబలిగా ప్రభాస్‌ వీరోచిత పోరాట దృశ్యాన్ని చివరి అస్త్రంగా సంధించిన రాజమౌళి ఇక పాటలు, ట్రెయిలర్లతో అబ్బుర పరిచే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతవరకు చూసిన దానిని బట్టి బాహుబలి చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు... జాతీయ వ్యాప్తంగా ఎక్కడ రిలీజ్‌ అయితే అక్కడ అదే పనిగా చూసేస్తారనే నమ్మకం కలుగుతోంది. బాహుబలి పోస్టర్ల కోసం నేషనల్‌ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూసారు. ఇక ఈ చిత్రం ఎలా ఉన్నా కానీ తప్పక చూసి తీరాల్సిన చిత్రాల జాబితాలో చేరింది.

అవతార్‌లాంటి చిత్రాలకి కొన్ని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆ చిత్రాన్ని వెండితెరపై చూసి తీరాల్సిందేనని ఎవరికి వారు ఫిక్స్‌ అయిపోయారు. అందుకే ఆ చిత్రం అంతటి రికార్డులని నెలకొల్పింది. అలాగే బాహుబలి చిత్రం ఎవరి అంచనాలని అందుకున్నా లేకున్నా బాక్సాఫీస్‌ని శాసించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రానికి వంద కోట్ల తక్కువ షేర్‌ రాదనే అంచనాలతో బయ్యర్లే దీనిపై ఎనభై అయిదు కోట్లు వెచ్చించారు. బాహుబలి ఎప్పుడు వస్తుందో క్లియర్‌గా తెలిస్తే దానికి కనీసం నెల రోజులైనా దూరం పాటించాలని నిర్మాతలంతా ఫిక్స్‌ అయిపోయారు. జులై, ఆగస్టులో రిలీజ్‌ ప్లాన్‌ చేసుకున్న వారందరి పరిస్థితి ఇలాగే ఉంది. బాహుబలిని ఒక్కరంటే ఒక్కరు కూడా తక్కువ అంచనా వేయడం లేదిప్పుడు.

Post a Comment

 
Top